కొండపి: సింగరాయకొండలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఐ హజరతయ్యా
మార్కాపురం ఘటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సీఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. సింగరాయకొండ నుండి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్లే ట్రావెల్స్ బస్సులను ఆపి ప్రమాదాల నివారణకు సూచనలు చేశారు. అదేవిధంగా బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం సేవించి ఉన్నారా, అత్యవసర సమయంలో అగ్నిమాపక సామాగ్రితో పాటు ఫిట్నెస్ ఉందో లేదో పరిశీలించారు. ఈ తనిఖీలలో సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఏఎస్ఐ శేషారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.