గద్వాల్: ఇండస్ట్రియల్ ఏరియా లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
శనివారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం సమీపంలో ఇండస్ట్రియల్ ఏరియా నందు సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.ఎమ్మెల్యే కి కాంట్రాక్టర్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.