కరీంనగర్: కరీంనగర్ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బండి సంజయ్కు రవీందర్ సింగ్ సవాల్
కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ఎంపీ బండి సంజయ్కు బహిరంగ లేఖ రాశారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా నియోజకవర్గానికి, రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాకు తెచ్చిన నిధులు, ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలపై బండి సంజయ్ స్పష్టత ఇవ్వాలని కోరారు.