బనగానపల్లె: రవ్వలకొండ వద్ద డంపింగ్ యార్డ్ ను తొలగించాలి: సిపిఐ నాయకులు డిమాండ్
బనగానపల్లె పట్టణంలోని రవ్వలకొండ వద్ద మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్ సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై CPI మండల కార్యదర్శి శివయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 1,000 మంది విద్యార్థులు, వందలాది కుటుంబాలు నివసించే ప్రాంతంలో చెత్తను డంప్ చేయడంతో దుర్వాసన, దోమలు, ఈగలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు