అంబేడ్కర్ చిత్రపటం విషయంలో దళిత సర్పంచ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇంకొల్లు సీఐ రమణయ్య ను సస్పెండ్ చేయాలని ఏఎన్పీఎస్ అధ్యక్షుడు చార్వాక చెప్పారు. శుక్రవారం బాపట్లలో ఆయన మాట్లాడారు. కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామ సర్పంచ్ ఠాగూర్ పై దాడి చేసినందుకు నిరసనగా రానున్న సోమవారం బాపట్లలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించి కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. సిఐపై చర్యలు తీసుకోపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.