హనుమకొండ: హన్మకొండ: మంటల్లో గాయపడి ఫుడ్ కోర్టు యజమాని పుష్పలత మృతి
హన్మకొండ అదాలత్ జంక్షన్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన లింగాల పుష్పలత చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె భర్త కేదారి ఇప్పటికే మృతి చెందారు. సమాజ సేవ కోసం ఆస్తులను కూడా అమ్ముకున్న ఈ దంపతుల మరణం స్థానికులను కలచివేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.