నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలం, మాముడూరు పంచాయతీలోని నడిగడ్డ అగ్రహారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు అనారోగ్యంతో ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం భర్త నరాల వెంగయ్య 95 సంవత్సరాల వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయారు. అదే బాధతో భార్య వెంకటమ్మ 90 సంవత్సరాల వృద్ధురాలు ఇవాళ చనిపోయారు. ఈ ఘటనతో బంధువుల్లో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృత్యువులో కూడా వీరి బంధం వీడకపోవడం విశేషం అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.