మామిడికుదురు: మామిడికుదురులో ఘనంగా బాలల దినోత్సవం మరియు గ్రంథాలయ వారోత్సవాలు
మామిడికుదురు గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ఎంపీ టీచర్ లక్ష్మీ శ్రీపూర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఏకేవీఆర్ సూర్య నారాయణ, బీడీసీ కన్నబాబు పాల్గొన్నారు.