కొండపి: వయోవృద్ధుల కొరకు ఆయుష్మాన్ భవ స్కీం పై అధికారులతో సమావేశం నిర్వహించిన కొండపి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వయోవృద్ధుల సంక్షేమ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 70 సంవత్సరాలు వయసు దాటిన వృద్ధులకు ప్రధానమంత్రి.ఆయుష్మాన్ భవ స్కీం కింద ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించే స్కీము పై ప్రజలలోకి తీసుకువెళ్లి పథకాన్ని అమలు చేయాలని మంత్రి అధికారులకు విజ్ఞప్తి చేశారు.