మర్రిపూడి మండలం గోసుకొండ అగ్రహారంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణలపై అవగాహన కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. మండలానికి 724 శాంపిల్స్ టార్గెట్ ఇచ్చారని అందులో 524 మట్టి నమూనాలు సేకరించామని తెలిపారు. రైతులు ఈ పరీక్షలు చేయించుకుంటే పంట దిగుబడికి అవసరమైన సూచనలు పొందేందుకు వీలుంటుందన్నారు.