జనగాం: జనగామలో మహిళ మెడలో 3 తులాల చైన్ లాక్కెళ్లిన దుండగులు
జనగామ జయశంకర్ నగర్ కాలనీలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కాసాని రజిత అనే మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.