భీమిలి: విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
విశాఖపట్నం 5వ వార్డులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని టీడీపీ నేత మొల్లి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. మోకాళ్ల వెంకట రమణ, రేవతి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.