గుంతకల్లు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళపై దాడి, గుత్తి ఆసుపత్రికి తరలింపు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో చిన్నపాటి విషయంపై శారద అనే మహిళపై కొందరు దాడి చేసి గాయపరిచారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో శారద అనే మహిళకు ఇంటి పక్కన ఉన్న మరో కుటుంబంతో చిన్నపాటి విషయంపై గొడవ జరిగింది. అయితే శుక్రవారం సాయంత్రం మరో సారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి శారదపై దాడి చేయగా ఆమె గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే శారదను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.