బాపట్ల: నల్లమోతువారిపాలెం నాగేంద్రస్వామి ఆలయంలో ఘనంగా 10వ వార్షిక ప్రతిష్ఠాపన వేడుకలు
బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెం నాగేంద్రస్వామి ఆలయంలో 10వ వార్షిక ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, భక్తులు పాల్గొన్నారు.