గద్వాల్: గద్వాల జిల్లా అయిజలో ఘోర ప్రమాదం: బైక్ నుంచి పడి ఉద్యోగి మృతి
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని భారత్ మాల రోడ్డుపై బైక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షేక్ అఫ్రీద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు రాయచూరులోని శిల్పా ఫార్మా కంపెనీ ఉద్యోగిగా గుర్తించారు.