ఒంగోలు అర్బన్: ఒంగోలు బిజెపి కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
Ongole Urban, Prakasam | Jul 6, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు బిజెపి కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి బిజెపి నాయకులు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడంతో పాటు అవినీతి నిర్మూలన సమాజానికి కృషి చేసేందుకే. శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీని స్థాపించారని బిజెపి నాయకులు ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.