అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి రూ. 5 లక్షల నిధులు మంజూరు
ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా రూ. 5 లక్షల నిధులు మంజూరు చేశారు. మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు భూమిపూజ జరిగింది. ప్రహరీ గోడ, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.