విశాఖపట్నం: కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కలెక్టర్ పేషీ హెచ్చరించింది. అధికారులు, ప్రజలు ఇలాంటి సందేశాలకు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని సూచించారు.