గిద్దలూరు: గిద్దలూరులో జరిగిన పీఫోర్ ప్రాథమిక వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం జరిగిన పి4 ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. 2047 సంవత్సరం నాటికి పీఫోర్ విధానంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శాలువా పూలమాలతో సన్మానించారు.