మార్కాపురం: మార్కాపురం మండలంలోని పాఠశాలల్లో ప్రశాంతంగా జరిగిన ఎస్ఎంసి ఎన్నికలు
మార్కాపురం మండల పరిధిలోని 84 పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు ఎంఈఓ రాందాస్ నాయక్ అన్నారు. అందులో ఒక పాఠశాలలో కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి అన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతమైన పారదర్శకమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజావుగా నిర్వహించబడిందని తెలిపారు.