పార్వతీపురం: పార్వతీపురంలో తుఫానుతో దెబ్బతిన్న పంటలు: రైతుల ఆవేదన, సచివాలయంలో వినతి
పార్వతీపురం మండలం ములగ, ఎల్.డి.వలస గ్రామాల్లో తుఫాను వర్షాలకు పంటలు నేలమట్టమయ్యాయి. నష్టపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు, పంట నష్టపరిహారం చెల్లించాలని మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ములగ సచివాలయంలో వినతి పత్రం అందజేశారు.