సత్తుపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రైతుల ధర్నా: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన
విద్యుత్ సరఫరాలో అంతరాయం తగ్గించాలని కోరుతూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీరు లేక బోర్లు, బావులపై ఆధారపడిన తమకు, కరెంట్ కోతలు వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.