శ్రీశైలం: శివ దీక్ష మాల ధారణ స్వీకరించి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న MLA బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలంలో కార్తీకమాసం కార్తీక శుక్రవారం కావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలనుసరించి ఆలయ అర్చకులు,అధికారులు సాదర స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం కార్తీకమాసం సందర్భంగా ఎమ్మెల్యే శివదీక్ష మాలధారణ స్వీకరించారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆలయ అర్చకులు,వేదపండితులు వేద ఆశీర్వచనం చెయ్యగా అధికారులు శ్రీస్వామి అమ్మవారి తీర్థం అందచేశారు.