కందుకూరు జనార్ధన స్వామి ఆలయంలో అపచారం కందుకూరులోని ప్రాచీన ప్రసిద్ధ స్కందపురి జనార్ధన స్వామి ఆలయంలో ఆదివారం ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పూజలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో హనుమాన్ దీక్షాధారులు హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామిగా చెప్పుకునే ఓ వ్యక్తి.. ఆయన గురువు ఫొటో పెట్టి పూజలు, భజనలు చేయడం వివాదాస్పదం అయింది.