ఖమ్మం అర్బన్: ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నలమాస కృష్ణ
ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ ప్రకటించారు. రాజకీయ పార్టీలు, డబ్బు, కుల సమీకరణాలకు అతీతంగా పట్టభద్రుల గొంతుకగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.