శ్రీకాకుళం: మూలపేట పోర్టు పనులను వేగవంతం చేయండి: రాష్ట్ర కార్యదర్శి కోన శశిధర్ ఆదేశం
సంతబొమ్మాళిలో మూలపేట పోర్టు నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ పరిశీలించారు. పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 93 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.