జనగాం: దేవరుప్పులలో ఇళ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే, గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.