రాయదుర్గం: మడేనహళ్లి గ్రామంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
డి.హిరేహాల్ మండలంలోని మడేనహళ్లి గ్రామంలో కూలి డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన తూర్పింటి శివరాజ్ (22) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి శివరాజ్ సంపాదించిన కూలి డబ్బుల గురించి, చెల్లెలు పెళ్లి ఖర్చుల గురించి తల్లిదండ్రులు అతడిని అడిగగా ఈ విషయంలో మనస్తాపానికి గురైన శివరాజ్, అర్దరాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామున వేప చెట్టుకు శివరాజ్ గ్రామ సమీపంలో ఉరివేసుకుని చనిపోయినాడని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.