యర్రగొండపాలెం: సుంకేసుల గ్రామానికి వెళ్లే రోడ్డు బాగు చేసుకున్న స్థానిక యువకులు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసులలో మౌలిక వసతులు లేకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మార్కాపురం నుండి సుంకేసుల వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు దెబ్బతింది. దీంతో ఎవరు పట్టించుకోకపోవడంతో వారి సమస్యలను వారే పరిష్కరించుకునేందుకు యువత ముందుకు వచ్చి గ్రావెల్ తో రోడ్డును పూడ్చి వేశారు.