వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి, ప్రార్థనలు నిర్వహించారు. కేంద్ర రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు తరఫున కార్యక్రమంలో పాల్గొన్నారు.