వికారాబాద్: చీలాపూర్లో అగ్నిప్రమాదం.. రెండు లారీల మక్కజొన్న పంట దగ్ధం
చీలాపూర్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో రైతుల మక్కజొన్న పంట దగ్ధమైంది. వీరప్ప అనే రైతు పొలంలో పెట్టిన నిప్పు పక్క పొలాలకు వ్యాపించడంతో రాకొండ రామన్న, రాకొండ బుగ్గ రాములు, కావాలి రాంచేంద్రీలకు చెందిన సుమారు రెండు లారీల పంట నష్టపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.