వనపర్తి: పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి: ఈనెల 16న కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం
బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 16న పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, రక్షణ వంటి సమస్యలపై పిల్లలు నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సాధారణ ప్రజావాణి ప్రాంగణంలోనే ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు.