ఏటూరునాగారం: వెంకటాపురం సీఐగా కాసాని శ్రీధర్ నియామకం: ముత్యం రమేశ్ బదిలీ
వెంకటాపురం సీఐగా ఉన్న ముత్యం రమేశ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కాసాని శ్రీధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. రమేశ్‌ను మల్టీజోన్-1 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో రమేశ్ చురుగ్గా వ్యవహరించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.