సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో మద్యం తాగి డ్రైవింగ్: 57 మందికి భారీ జరిమానా, ఐదుగురికి జైలు శిక్ష
సిద్దిపేటలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 57 మందికి రూ.5.60 లక్షల జరిమానా, ఐదుగురికి జైలు శిక్ష పడింది. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 33 మందికి రూ.1.65 లక్షల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు తెలిపారు.