ఏటూరునాగారం: ములుగు: వాణిజ్య భవనాల ఆస్తి పన్ను తగ్గింపుపై కలెక్టర్ కీలక ప్రకటన
ములుగు మున్సిపాలిటీలో వాణిజ్య భవనాల ఆస్తి పన్ను పెంపుపై వ్యాపారులతో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సమావేశమయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నివాస భవనాల పన్నులో మార్పులేదని స్పష్టం చేశారు.