రాజమండ్రి సిటీ: ఓట్ల తొలగింపుపై నిరసనలు: మోదీ ప్రభుత్వంపై ఏపీసీసీ నేత మార్టిన్ లూథర్ విమర్శలు
ఓట్ల తొలగింపు, సర్ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమని ఏపీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.