గద్వాల్: మా భూమి మాకు ఇప్పించాలని కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న రైతులు
గద్వాల జిల్లా కేంద్రంలోని తెలుగుపేటకు చెందిన రైతులు సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ వ్యవసాయ భూమిని కొందరు కబ్జా చేశారని, పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన చెందారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమ భూమిని తమకు అప్పగించాలని వారు అధికారులను కోరారు.