శ్రీశైలం: మహానందిలో ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలి : ఎంపీడీవో మహబూబ్ దౌలా
గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా, పక్కాగా అమలు చేయాలని ఎంపీడీవో మహబూబ్ దౌలా పేర్కొన్నారు.మహానంది మండలం తిమ్మాపురం లోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అభివృద్ధి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలుపై పలు కీలక సూచనలు చేశారు.