బాపట్ల: అద్దంకిలో మురుసు తుఫాను బీభత్సం: రూ.4 కోట్ల విద్యుత్ ఆస్తి నష్టం
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మురుసు తుఫాను వల్ల 2 వేల విద్యుత్ స్తంభాలు, 150 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మొత్తం 4 కోట్ల నష్టం వాటిల్లినట్లు డీఈఈ వెంకటరావు తెలిపారు. 500 మంది సిబ్బందితో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఆయన పేర్కొన్నారు.