ఉప్పునుంతల: వెల్టూరులో భారీగా పట్టుబడిన నల్ల బెల్లం: 21 క్వింటాళ్లు స్వాధీనం
వెల్టూరు శివారులో నాటుసారా తయారీకి తరలిస్తున్న 21 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని ఉప్పునుంతల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తుండగా తనిఖీల్లో ఈ సరుకు పట్టుబడింది. డ్రైవర్ శంకర్, యజమాని రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు.