ఒంగోలు అర్బన్: జిల్లా కేంద్రమైన ఒంగోలు త్రివర్ణ శోభితం.3000 మందితో భారీ తీరంగా ర్యాలీ
Ongole Urban, Prakasam | Aug 13, 2026
జిల్లా కేంద్రమైన ఒంగోలు త్రివర్ణ శోభితమయింది. గురువారం ఉదయం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రముఖులు సుమారు 3వేల మంది జాతీయ పతాకాలను చేతబూని చేపట్టిన ర్యాలీతో ట్రంక్ రోడ్ కిక్కిరిసింది. వివిధ యూనిఫారాలు ధరించి ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు జరిగిన మారథాన్ ర్యాలీ, వందేమాతరం నినాదాలతో సాగింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో దేశ భక్తిని పెంచి స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని నింపింది.మినీ స్టేడియంలో ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే