అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రకటించారు. పుస్తక పఠనం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని, గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.