వరంగల్: వరంగల్లో భారీగా కల్తీ కారం, పసుపు స్వాధీనం
వరంగల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి 2,250 కిలోల కల్తీ కారం, పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అపరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తున్న ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ రూ. 5.92 లక్షలుగా ఉంది.