వనపర్తి: వనపర్తిలో సాగునీటి కోసం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ సీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేఎల్ఐ, జూరాల ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.