వరంగల్: కిల వరంగల్ లో జరిగిన మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదివారం రాత్రి 8 గంటలకు వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండల కేంద్రంలో జరిగిన మొహరం వేడుకలలో అటవీ పర్యావరణ దేవదాస్ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీర్లను దర్శించుకుని పూలు దట్టీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి సురేఖ. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ముస్లింలు ఎక్కువ శాతం ఉంటారని కాబట్టి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారని ఆమె అన్నారు. మొహరం పండుగ సందర్భంగా పీర్లను తిలకించడానికి కులమతాలకతీతంగా అన్ని మతాలవారు కలిసి ప్రార్థనలు చేసి తమ మొక్కులు సమర్పించుకుంటారని ఈ సందర్భంగా మంత్రి సురేఖ