అమ్రాబాద్: మాచారం గ్రామంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే పనులను ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.