చిత్తూరు అర్బన్: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి తండ్రి పెద్దకర్మ లో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
Chittoor Urban, Chittoor | Jul 5, 2025
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి తండ్రి కీ.శే.శ్రీ కంచర్ల రామయ్య గారి చిత్రపటానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు పూలమాల వేసి అంజలి ఘటించారు. శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన కీ.శే శ్రీ కంచర్ల రామయ్య గారి పెద్దకర్మ కు ఎమ్మెల్యే హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారి సతీమణి నారా భువనేశ్వరి గారితో మాట్లాడారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారిని పరామర్శించారు.*