రంగాపురం నుండి అర్ధవీడు వరకు నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ .మేము అర్ధవీడు మండలం, మార్కాపురం జిల్లా పరిధిలోని బస్సిరెడ్డిపల్లె, పోతురాజుటూరు, యాచావరం, రంగాపురం, గన్నేపల్లె, బొమ్మిలింగం, వెలగలాపాయ గ్రామాల ప్రజలము. మా గ్రామాల ప్రజలు కంభం (Cumbum) మరియు పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రస్తుతం సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వృద్ధులు మరియు అత్యవసర వైద్య సేవలు అవసరమైన ప్రజలు రవాణా సమస్యలను ఎదుర్కొంటున్నారు. .రంగాపురం నుండి అర్ధవీడు వరకు నూతన రహదారి నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించి, రోడ్డు మంజూరు చేసి, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించవలసిందిగా ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాము. ఈ రహదారి నిర్మాణం ద్వారా పై గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగి, విద్య, వైద్యం, వ్యవసాయం మరియు రోజువారీ అవసరాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
Right App