కురుపాం: జియ్యమ్మవలసలో కుక్కల బీభత్సం: 30 మేకపిల్లలు మృతి
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదోరవలసలో శుక్రవారం అర్ధరాత్రి కుక్కల దాడి జరగడంతో 30 మేకపిల్లలు మృతి చెందాయి. దీనివల్ల రైతుకు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. బాధితుడికి పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.