ధర్మవరం బిజెపి నేత హరీష్ బాబు పట్టణంలో కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొన్నారు. శివానగర్ లో ఉన్న శ్రీ బచ్చు నాగంపల్లి ఆలయంలో తలపై జ్యోతులు పెట్టుకొని ప్రదక్షణాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు హరీష్ బాబు వెంట పాల్గొన్నారు.